నిజంనిప్పులాంటిది

Mar 06 2023, 18:45

కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేతలు.. అరెస్ట్ చేయాలని డిమాండ్..

•మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్

తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ పైన దుర్భాషలాడిన,సంపుతానని బెదిరించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

సోమవారం డాక్టర్ చెరుకు సవాహస్ మాజీ జిడ్పిటిసి తండు సైదులు గౌడ్,కాంగ్రెస్ ఎస్సి.సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్,బి.సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీ నారాయణ తో కలిసి జిల్లా ఎస్పీ గారికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై పిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ నిన్నటి రోజున వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేయలేదని అతని అరెస్టు చేయలేదని అందుకే జిల్లా ఎస్పీని కలిసి విన్నవించామన్నారు.

తక్షణమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరెస్ట్ చేసి చెరుకు సుధాకర్ కు చెరుకు సుధాకర్ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఏ బహుజన నాయకుడు ఎదిగినా ఓర్వనితనం వెంకట్ రెడ్డి ది అన్నారు.చెరుకు సుధాకర్ కు పిసిసి ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గిట్టకనే ఈ తథంగానికి తెరలేపారు అన్నాడు. ఒక పార్లమెంటు సభ్యుడు అయి ఉండి నీతి నిజాయితీ విలువలు లేకుండా అహంభావంతో అహంకారపూరితంగా ఒక ఉద్యమకారునిపై మాట్లాడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కూడా స్పందించాలన్నారు. వెంకటరెడ్డి మతిస్థిమితం కోల్పోయి చెరుకు సుధాకర్ నన్ను తిట్టాడని ఊరికే పదేపదే అనడం కంటే ఏమన్నాడో మీడియా ముందు రుజువు చేయాలని డిమాండ్ చేశాడు. నీ చిల్లర మాటలు ప్రజలు గమనిస్తున్నారని నీ నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

చెరుకు సుధాకర్ కుమారుడు డాక్టర్ చెరుకు సువాస్ మాట్లాడుతూ మా కుటుంబానికి వెంకటరెడ్డి నుండి ప్రాణహాని ఉందని మాకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. తక్షణమే అరెస్టు చేయాలని కూడా కోరడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పందుల సైదులు, తెలంగాణ గౌడ సంక్షేమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్,గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేశ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వడ్డే బోయిన సైదులు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్,బిసి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మొగుళ్ళ వినోద్ కుమార్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగు నరేష్ గౌడ్, శ్రీ గౌడ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కొంపెల్లి రామన్న గౌడ్ యూసూఫ్,జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 06 2023, 08:51

Viveka Case: ఇవాళ సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు..

వివేకా హత్య కేసులో నేడు హైదరాబాదులో జరిగే సిబిఐ విచారణకు హాజరు కావడం లేదు కడప ఎంపి అవినాష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందు వలన హాజరు కాలేనని తెలిపారు ఎంపి అవినాష్ రెడ్డి..

దీనిపై ఇంతవరకు సమాచారం ఇవ్వలేదు సీబీఐ అధికారులు. ఈరోజు వేంపల్లి మండలంలో గృహసారధుల కార్యక్రమంలో పాల్గొననున్నారు ఎంపి అవినాష్ రెడ్డి.

వేంపల్లి మధు రెడ్డి కళ్యాణ మండపంలో వైసిపి సమావేశం జరగనుంది. ఈరోజు కడప సెంట్రల్ జైలు లోని అతిధి గృహంలో సిబిఐ విచారణకు ఎంపి తండ్రి భాస్కర రెడ్డి హాజరయ్యే అవకాశం వుందని తెలుస్తోంది..

నిజంనిప్పులాంటిది

Mar 06 2023, 06:40

Yuvagalam-Nara Lokesh: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత..

పీలేరు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర 35వ రోజు ఉత్సాహంగా సాగింది. ఎంజేఆర్‌ కళాశాల అగ్రహారం వద్ద అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది..

అగ్రహారం వద్ద తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, కార్యకర్తలు లోకేశ్‌తో కలిసి నడిచారు. పాదయాత్ర పీలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ దాటాక స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో లోకేశ్‌ పాదయాత్రను చూసి కొందరు వైకాపా కార్యకర్తలు జై జగన్‌ అని నినాదాలు చేశారు. ఇది గమనించిన తెదేపా కార్యకర్తలు వారిని తరిమికొట్టారు. దీంతో వారు తప్పించుకొని అక్కడి నుంచి పరారయ్యారు. రాయచోటి డీఎస్పీ శ్రీధర్‌, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

నిజంనిప్పులాంటిది

Mar 06 2023, 06:34

గవర్నర్‌, కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు వరుస ట్వీట్లు

హైదరాబాద్‌: వైద్య కళాశాలల (Medical colleges) కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ఆరోపించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు.

ఈ మేరకు అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ (Etela Rajender) కేంద్రాన్ని మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరారని.. అందుకు కేంద్రం సైతం సానుకూలంగా స్పందించిందని పేర్కొంటూ ఓ వీడియోను మంత్రి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం సకాలంలో మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోలేదంటూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Governor Tamilisai Soundararajan) ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన హరీశ్ రావు ఈ అంశంపై వరుస ట్వీట్లు చేశారు. మెడికల్ కాలేజీల కేటాయింపులో కేంద్ర మంత్రులు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఒకరు తెలంగాణ మెడికల్ కాలేజీలు కావాలని కోరలేదంటే... మరొకరు ప్రైవేటు మెడికల్ కాలేజీలున్న ఖమ్మం, కరీంనగర్‌లో కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోవటం వల్లే కొత్తవి మంజూరు చేయలేదంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని సైతం మంత్రి ట్వీట్‌కు జతచేశారు. ప్రతి లక్ష మందికి 19 మెడికల్ సీట్లతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్న హరీశ్ రావు.. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్... రాష్ట్ర నిధులతో 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. కేంద్రం, గవర్నర్ అనవసరంగా విమర్శలు చేసే బదులుగా ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన తెలంగాణను అభినందించాలన్నారు.

బీబీనగర్ ఎయిమ్స్‌కి నిధుల కొరత ఉందన్న హరీశ్‌రావు.. దేశవ్యాప్తంగా ఎయిమ్స్ వృద్ధి కోసం రూ.1,365 కోట్లు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు మాత్రం కేవలం రూ.156 కోట్లే కేటాయించటానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు. గుజరాత్ ఎయిమ్స్‌కి 52 శాతం , తెలంగాణ 11.4 శాతం నిధులు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ గవర్నర్ తన పంథాను మార్చుకొని... ట్రైబల్ యూనివర్సిటీ, రైల్ కోచ్‌లు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన వారవుతారని హరీశ్‌రావు పేర్కొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 06 2023, 06:31

మోదీకి కేసీఆర్‌ సహా 9 మంది ప్రతిపక్ష నేతల లేఖ

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా అరెస్టును ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి తొమ్మిది మంది ప్రతిపక్ష నేతలు లేఖ రాశారు.

దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందని నేతలు ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.

లేఖ రాసిన వారిలో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, భగవంత్‌ మాన్‌, మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాక్రే, ఫరూక్‌ అబ్దుల్లా, శరద్‌ పవార్‌, అఖిలేశ్, తేజస్వి యాదవ్‌ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారాలు, ఆకాంక్షలే అన్నిటికంటే కీలకమన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాలని పేర్కొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 05 2023, 20:51

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై నల్గొండ వన్ టౌన్ పోలీస్టేషన్ లో పిర్యాదు...
నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సి.ఐ గోపి గారికి డాక్టర్ చెరుకు సుధాకర్ గారి కుమారుడు డాక్టర్ చెరుకు సువాహస్..భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పై ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ చెరుకు సువాస్,తిప్పర్తి మాజీ జడ్పిటిసి తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ తక్షణమే వెంకట్ రెడ్డి గారిని అరెస్టు చేయాలని..ప్రభుత్వం వారి కుటుంభానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది..

నిజంనిప్పులాంటిది

Mar 05 2023, 20:47

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై నల్గొండ వన్ టౌన్ పోలీస్టేషన్ లో పిర్యాదు...

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై నల్గొండ వన్ టౌన్ పోలీస్టేషన్ లో పిర్యాదు...

నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సి.ఐ గోపి గారికి డాక్టర్ చెరుకు సుధాకర్ గారి కుమారుడు డాక్టర్ చెరుకు సువాహస్..భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పై ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ చెరుకు సువాస్, తిప్పర్తి మాజీ జడ్పిటిసి తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ తక్షణమే వెంకట్ రెడ్డి గారిని అరెస్టు చేయాలని..ప్రభుత్వం వారి కుటుంభానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది..

నిజంనిప్పులాంటిది

Mar 05 2023, 18:48

డాక్టర్ చెరుకు సుధాకర్ హత్యకు ప్లాన్ వేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి... చెరుకు సుధాకర్ కు రక్షణ కల్పించాలి..

•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు : ఐతగోని జనార్దన్ గౌడ్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసిన బహుజన ఉద్యమ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ని భౌతికంగా హత్య చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐత గోని జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఆదివారం రోజున కోమటిరెడ్డి వెంకటరెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ గారి కుమారుడు డాక్టర్ చెరుకు సువాస్ కు ఫోన్ చేసి నిన్ను మీ నాన్నను చంపడానికి వంధలమంది 100 వెహికల్ల లో తిరుగుతున్నారని ఫోన్ చేసి బెదిరించడాన్ని నిరసిస్తూ నల్లగొండ పెద్దగడియారం చౌరస్తాలో బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అయితే కొన్ని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుల అహంకారంతో మాట్లాడుతున్నాడని ఇది కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ డిల్లీ అధిష్టానం వెంకట్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడినా, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినా చర్యలు తీసుకోవడం లేదని వారు అన్నారు.నల్లగొండ జిల్లాలో ఏ బహుజన నాయకుడు ఏదిగినా జీర్ణించుకోలేని దుర్మార్గుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

డాక్టర్ చెరుకు సుధాకర్ ని రాజకీయంగా ఎదుర్కొనలేక భౌతికంగా అంతం చేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లాన్ వేశాడని ఈ కుట్రలను భగ్నం చేయాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందన్నారు. నల్లగొండ జిల్లాలో నల్లగొండ నియోజక వర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాజకీయంగా బీటలు బారి పిచ్చెక్కి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారని తక్షణమే ఎర్రగడ్డ హాస్పిటల్లో వెంకట్ రెడ్డికి వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు. ఒక ఎంపీ హోదాలో ఉండి ఇలా బూతులు మాట్లాడమని, హత్యలకు ప్లానింగ్ లు వేయమని కాంగ్రెస్ పార్టీ నేర్పిందా అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ పోటీ చేసినా చిత్తుచిత్తుగా ఓడించాల్సిన బాధ్యత బహుజనులపై ఉందన్నారు.తక్షణమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరుకు సుధాకర్ కు వారి కుమారుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని తెలంగాణ ఉద్యమకారుడు అయిన డాక్టర్ చెరుకు సుధాకర్ కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కారింగు నరేష్ గౌడ్, కొంపెల్లి రామన్నగౌడ్ ,గోవర్థన్,నవీన్, శివ,లక్ష్మీ నారాయణ, ప్రణిత్,లక్ష్మణ్,ముఖేష్, అశోక్ ,వినోద్ తదితరులు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 05 2023, 18:44

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై క్రిమినల్ కేస్ నమోదు చేయాలి...

•బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కుమారుడు డాక్టర్ సుహాస్‌కు ఫోన్ చేసి మీ ఇద్దరిని తన అభిమానులు చంపుతామని వంద వెహికిల్స్‌లో తిరుగుతున్నారని, వారం రోజుల్లో చంపేస్తారని తీవ్ర పదజాలంతో బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై క్రిమినల్ కేస్ నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రకుల అహంకారంతో బడుగు బలహీన వర్గాల ఎదుగుదలను చూసి ఓర్వలేక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ గారిని చంపడానికి 100 వాహనాలు ఏర్పాటు చేసినట్లు,మరియు సుధాకర్ గారి అబ్బాయిని సుహస్ ను చంపి, హాస్పిటల్ కూలగొడుతం అని స్వయంగా ఆయన కుమారునికి ఫోన్ చేసి రాయలేని రీతిలో బెదిరించడం పట్ల బీసీ యువజన సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుoదన్నారు.

రాబోయే రోజుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పోటీచేసిన బీసీలందరూ ఏకమై మీకు రాజకీయ సమాధి కడుతారని హెచ్చరించారు. తక్షణమే అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 05 2023, 17:12

కేంద్ర ప్రభుత్వ పథకాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు సరికాదు : పల్లపు బుద్ధుడు

కేంద్ర ప్రభుత్వ పథకాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు సరికాదని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పైన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వివక్షత చూపిస్తున్నారని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంత్యోదయ సిద్ధాంతంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆహారం అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతున్నారు. మరి ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య చికిత్సల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని నరేంద్ర మోడీ గారు ఐదు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినారు.

ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా 1665 రకాల రోగాలకు చికిత్స ఉచితంగా ఉంటుందన్నారు. ఇట్టి పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంపై వివక్షత చూపిస్తూ పేద ప్రజలకు చేరకుండా అడ్డుకాలు వేసి ఇప్పటివరకు ఈ పథకాన్ని ఎవరికీ చేరువ కాకుండా చేసినారు ఇంతటి దుర్మార్గపు పరిపాలన దొర నిరంకుశ పరిపాలన తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టినారు.

పేద ప్రజలు ఉండడానికి ఇల్లు కట్టుకోవాలని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, పల్లెపకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, సుకన్య సమృద్ధి యోజన, ఫసల్ బీమా యోజన, పిఎం కిసాన్ యోజన, తెలంగాణ రాష్ట్రానికి రహదారులు, నీళ్ల కోసం నిధులు, ఎరువుల కర్మాగారాలు, విద్యుత్ కర్మాగార కేంద్రాలు, విద్య, వైద్యం, ఈ సంజీవని ఆర్గానిక్ మెడిసిన్స్ రకరకాలుగా అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వ వాటాలు ఇస్తూ రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రంపై వివక్షత చూపిస్తూ కేంద్రం నుంచి వస్తున్న పథకాలను ప్రజల్లోకి వెళ్లకుండా ఆపడం జరుగుతుంది ఇకనైనా కేంద్రం నుంచి వస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పేద ప్రజలకు అందే విధంగా చూడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నారు.